# @renae_j_grace on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/Cq_3zQMvM0d
- **Gondola URL:** https://gondola.cc/posts/63391211-renae-j-grace-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/d723159d33.jpg
- **Posted:** 2023-04-14T01:23:46.000+00:00
- **Account Owner:** Renée Grace J (@renae_j_grace) — https://gondola.cc/renae_j_grace

## Caption

జ్ఞాన శిఖరం

తరతరాల కులదురహంకార దౌర్జన్యాలకు ఎదురు నిలిచి,
ఆటంకాలను అధికమించి,
కుట్రలు,కుతంత్రాలు జయించి,
అపారమేధస్సు సముపార్జించి,
ఖండాంతరాల కీర్తి  సాధించి,
పీడితులకు పీనల్ కోడ్ ప్రొటెక్షన్ ఇచ్చి,
తరతరాలుగా తొక్కిపెట్టిన బహుజన గొంతులకు ప్రశ్నించే బలాన్నిచ్చి,
అసమానతల ఊబి నుండి సమానవత్వపు శిఖరానికి బాటలు వేసి,
ఎన్నిక లేనివారిని ఎన్నికల నిర్ణేతలను చేసి,
పామరులు పండితులుగా,
పాలితులు పాలకులుగా,
కులవృత్తి బందీలు సకల వృత్తి బంధువులుగా,
వంటింటి బానిసలు
చట్టసభల ప్రతినిధులుగా,
ఎదిగే హక్కులు కల్పించి,
మన తలరాతలను తిరగ రాసుకునే అవకాశాలు కల్పించిన నవ భారత నిర్మాణకుడు.
 
మానవత్వ కోణమున్న ప్రతివానికీ మహనీయుడు.
అనుభవిస్తున్న హక్కులు గుర్తించిన వారికి పూజ్యనీయుడు.

 " మా పూర్వ విద్యార్థి" అని చెప్పడానికి పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు పరవశిస్తున్న జ్ఞాన జ్యోతి!

అసమానతలు, అజ్ఞానం, విద్వేషాలు,ఆధిపత్యం అనే విషాగ్నులు అణువణువునా నింపుకుని దళిత నాయకుడని ప్రచారం చేయడానికి పోటీ పడుతున్న స్వార్థశక్తులకు సింహస్వప్నం!. 

మేధస్సును మదించిన ప్రపంచం కీర్తించింది *జ్ఞానశిఖరం* (A Symbol of knowledge) అని.

స్వాభిమానానికి, ఆత్మ విశ్వాసానికి నిలువెత్తు రూపంగా నిలిచిన
భారతీయ దార్శినికుడు, సమతావాది, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్.

ఆ మహర్షి జననం భారతీయ బహుజనుల దాస్య విముక్తికి అరుణోదయం. 

ఇష్టంతోనైనా, కష్టంతోనైనా ఆయన ఆలోచనలు లేకుండా అడుగు ముందుకు పడదు సుమీ! నడుస్తున్న చరిత్రే సాక్ష్యం. అందుకే అంబేద్కర్ అడుగుజాడల్లో నడవడం 
సకల జనులకు అనివార్యం, శిరోధార్యం.
 అప్పుడే భారత్ జగజ్జేత కాగలదు.
జోహార్! డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జోహార్!!

---132వ జయంతి శుభాకాంక్షలతో---
#brambedkar #babasahebambedkar #drbrambedkar #bhimraoambedkar #bhimraoramjiambedkar #ambedkar #ambedkarism #ambedkarjayanti #jaibhim

## Stats

- **Views:** 0
- **Likes:** 0
- **Shares:** 0
- **Comments:** 5

## Tags

bhimraoramjiambedkar, ambedkar, jaibhim, brambedkar, drbrambedkar, bhimraoambedkar, ambedkarism, babasahebambedkar, ambedkarjayanti

---
Copyright (c) Gondola