ఎర వేసే ఇలాంటి వారికి దూరం... దూరం..
#besafe
సోషల్ మీడియా కోర్టు… ఒక ప్రాణాన్ని తీసింది!
కేరళలో ఇటీవల జరిగిన ఈ ఘటన మనందరినీ కలచివేస్తుంది.
ఇది కేవలం ఒక ఆత్మహత్య కథ కాదు…
ఇది సోషల్ మీడియాలో జరిగే డిజిటల్ ట్రయల్స్ ఎంత ప్రమాదకరమో చెప్పే హెచ్చరిక.
తిరువనంతపురానికి చెందిన దీపక్ (42) అనే వ్యక్తి, తనపై వచ్చిన ఆరోపణలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. కారణం?
ఒక మహిళ బస్సులో తీసిన సెల్ఫీ వీడియో.
ఆ వీడియోలో ఆమె — తన వెనుక కూర్చున్న దీపక్ తనను అసభ్యంగా తాకాడని ఆరోపించింది.
వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.
తర్వాత మొదలైంది అసలు శిక్ష…
సోషల్ మీడియాలో నెటిజన్లు
దీపక్ ఫోటోలు, వివరాలు షేర్ చేసి
అతన్ని నేరస్తుడిగా ముద్ర వేశారు.
ఎటువంటి విచారణ లేకుండా,
ఎటువంటి నిజ నిర్ధారణ లేకుండా,
ఒక వ్యక్తి క్యారెక్టర్ అస్సాసినేషన్ మొదలైంది.
తీవ్ర మనస్తాపంతో, అవమానంతో, ఒత్తిడితో
దీపక్ తన జీవితాన్నే ముగించుకున్నాడు.
కానీ ఆ తర్వాత బయటికి వచ్చిన నిజాలు మనల్ని మరింత కలిచివేశాయి.
ప్రాథమిక విచారణ ప్రకారం —
అతను కావాలని ఆమెను తాకలేదని,
బస్సు రద్దీ లేదా కుదుపుల వల్ల తగిలి ఉండవచ్చని
కుటుంబసభ్యులు, మిత్రులు చెబుతున్నారు.
అంటే…
...